- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టా మధు కొంపముంచింది ఆ సాన్నిహిత్యమేనా?
దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పుట్టా మధుకు మధ్య ఉన్న సాన్నిహిత్యంపై గత కొంతకాలంగా నిఘా కళ్లు నీడలా వెంటాడుతున్నాయి. వీరిద్దరూ కలిసి పలు వ్యాపార లావా దేవీల్లో భాగస్వాములుగా ఉన్నారన్న ప్రచారం ప్రస్తుతం జిల్లాలో విపరీతంగా జరుగుతోంది. గత కొంతకాలంగా అధిష్టానంతో సత్ససంబంధాలు లేకుండా పోయిన ఈటలతో ఆయన ఎందుకు దగ్గరయ్యారు అన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాల్లో వ్యాపారాలు, పలు చోట్ల భూముల కొనుగోళ్లు వంటి వ్యవహారాల గురించి తెలిసినట్టు సమాచారం.
ఆ సమావేశానికి హాజరయ్యాడా..?
రెండు మూడు నెలల క్రితం కర్నాటకలో జరిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుల మీటింగ్‌కు పుట్టా మధు హాజరయ్యాడన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఈ మీటింగ్‌లో తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భావం గురించి చర్చకు వచ్చినట్టు అధిష్టానం వద్ద సమాచారం తెలుస్తోంది. కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్న పుట్టా మధు ఉన్నట్టుండి తన వైఖరిని మార్చుకోవడమే ఇంతదూరం తెచ్చిందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడొకరు కామెంట్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రి కాబట్టే ఈటలతో సాన్నిహిత్యంగా ఉన్నాం తప్ప మరో కారణమేమీ లేదని మంథని టీఆర్ఎస్ కేడర్ చెప్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాకు చెందిన మిగతా మంత్రులతో అంత క్లోజ్ రిలేషన్ మెయింటెన్ ఎందుకు చేయలేదు అన్న విషయంపైనే అధిష్టానం పెద్దలు చర్చించుకున్నట్టు సమాచారం.
అదృశ్యం వెనక..?
అయితే ఏప్రిల్ 30వ తేదీన అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్టా మధు కావాలనే అదృశ్యం అయ్యారని ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు పుట్టా మధు, వామన్ రావు మర్డర్ కేసులో ప్రమేయంపై ప్రచారం జరగ్గా.. ఉన్నట్టుండి ఏప్రిల్ 30న ఉన్నతాధికారుల నుండి ఫోన్ రావడంతో ఆయన తప్పించుకుని పోయాడని స్పష్టం అవుతోంది. అయితే అధిష్టానం తన గురించి తనపై నిఘా వేస్తోందన్న విషయం పుట్ట మధుకు ముందుగా లీక్ కావడం వల్లే ఆయన అదృశ్యం అయ్యాడని అనుమానిస్తున్నారు. అయితే పుట్ట మధు ముందుగానే అధినేతను కలిసి వాస్తవాలు వెల్లడిస్తే ఇంతదూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆయన నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడేంత చనువు ఉన్నప్పుడు సీరియస్ అయ్యే వరకూ తెచ్చుకోవడమే బ్లండర్ మిస్టేక్ అని అంటున్నారు.