భర్తను బంధించి భార్య, కూతురిపై అత్యాచారం

by Anukaran |   ( Updated:2020-08-02 12:11:18.0  )
భర్తను బంధించి భార్య, కూతురిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బుర్హాన్ జిల్లాలోని స్టోన్ క్రషింగ్ సమీపంలో ఈ దారుణం వెలుగుచూసింది. స్టోన్ క్రషింగ్ సమీపంలో ఓ ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేశారు.

ఇంటి నుంచి నగదు, బంగారం అపహరించిన దుండగులు.. భర్తను బంధించి తన భార్య, బిడ్డని కూడా ఎత్తుకెళ్లారు. పైగా మైనర్ బాలిక కావడం గమనార్హం. అనంతరం ఆ ఇంటి వెనకాలే ఉన్న పొలాల్లోకి ఈడ్చుకెళ్లి వారిపై సామూహిక అత్యాచారం చేశారు. ఎంత బతిమాలిన వినకుండా భార్య, మైనర్ బాలికకు నరకం చూపించారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై అత్యాచారం, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story