ముందు డిపాజిట్ తెచ్చుకోండి.. ఎమ్మెల్యే గువ్వలను విమర్శిస్తే సహించం..

by Shyam |
ముందు డిపాజిట్ తెచ్చుకోండి.. ఎమ్మెల్యే గువ్వలను విమర్శిస్తే సహించం..
X

దిశ, లింగాల : హుజురాబాద్‌లో డిపాజిట్ కూడా సాధించలేని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని విమర్శించే స్థాయి లేదని లింగాల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల సుధీర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆనంద్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేటి తిరుపతయ్య, అన్నారు. బుధవారం లింగాల మండల కేంద్రంలోని ఏకలవ్య కూడలి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో హుజురాబాద్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిస్తే రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేసినా స్పందించని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నేడు ఎమ్మెల్యే గురించి దుష్ప్రచారం చేయడం సరి కాదని అన్నారు. అదేవిధంగా డిపాజిట్ కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ నేడు ఎగిరెగిరి పడుతోందని వారికి విమర్శించే స్థాయి లేదని అన్నారు. మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో డిపాజిట్ సాధించలేని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటగా రాజీనామా చేయాలని, నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.

ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో లింగాల గ్రామ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కంప వెంకటగిరి, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రనోజి, జనార్ధన్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్లా, ఆంజనేయులు, కావేరి ప్రశాంత్ కుమార్ వార్డ్ మెంబర్లు పోల శీను, నాగరాజు, సంజు, వీరస్వామి, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed