- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
108 రోజుల తర్వాత కుటుంబంతో వార్నర్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ వార్నర్ మూడు నెలల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్, ఐపీఎల్ కోసం ఆస్ట్రేలియాలో కుటుంబాన్ని వదిలి వెళ్లిన వార్నర్.. నవంబర్ 10 తర్వాత ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అయితే 14 రోజుల క్వారంటైన్ నిబంధన కారణంగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు. క్వారంటైన్ ముగియడంతో వార్నర్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా జట్టు సభ్యులు వారి కుటుంబాలను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వార్నర్ తన కుటుంబంతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశాడు. ‘108 రోజుల తర్వాత నా ముగ్గురు కుమార్తెలను కలుసుకున్నాను. నా మూడో కూతురు ఇస్లా ఇంకా కూర్చోవడం లేదు. గ్రూప్ ఫొటోలో కూడా నవ్వలేదు’ అంటూ క్యాప్షన్ జోడించాడు. కాగా, ఇండియాతో వన్డే సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వార్నర్ వెంటనే జట్టుతో కలిశాడు.