- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్ధన్నపేటలో బట్టబయలైన అధికారుల వంకర పనులు.. కీలక సాక్ష్యాలివే
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో అధికారుల వంకర పనులు సాగుతున్నాయి. ప్రగతి పనుల మాటున అవినీతి మురికి పారుతోంది. పట్టణాభివృద్ధి పనులను పాలకవర్గం పెద్దలు, మున్సిపల్ అధికారులు లంచాల రాబడిగా మల్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పట్టణంలో జరుగుతున్న అనేక పనుల వెనుక మున్సిపాలిటీ కీలక అధికారి, పాలకవర్గం.. ముడుపుల వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 2వ వార్డులో జరిగిన ఒక్క డ్రైనేజీ నిర్మాణంలోనే ఏకంగా లక్షల రూపాయలు పాలకవర్గం ముఖ్యుల చేతుల్లోకి ముడుపులు చేరినట్లుగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ‘దిశ’కు లభ్యమయ్యాయి. పాలకవర్గంలోని ముఖ్యులు చేస్తున్న వంకర పనులకు ఓ బడా ప్రజాప్రతినిధి అండదండలు ఉండటమే కారణమన్న ఆరోపణలు పట్టణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
అధికారుల వంకర బుద్ధి.. వంకలు తిరిగిన డ్రైనేజీ
పట్టణాభివృద్ధికి గత సంవత్సరం రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి రూ.13కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులు కొన్ని పూర్తవగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పట్టణంలోని 2వ వార్డులో మూడు నెలల క్రితం పూర్తయిన డ్రెయినేజీ నిర్మాణంలో జరిగిన అవకతవకలు బయటకు వస్తున్నాయి. డ్రెయినేజీ నిర్మాణం అసంబద్ధంగా జరగడం వెనుక ముడుపుల బాగోతమే కారణమని తెలుస్తోంది.
కాల్వ నిర్మాణం జరిగిన తీరును పరిశీలిస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. నిబంధనల ప్రకారం రోడ్డుకు 55 ఫీట్ల దూరంలో డ్రెయినేజీ నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే మునిసిపల్ అధికారులు వంకర బుద్ధిని ప్రదర్శించారు. రోడ్డు నుంచి డ్రెయినేజీ నిర్మాణం ఒకచోట 55 ఫీట్ల దూరంలో.. మరోచోట 45 ఫీట్ల దూరంలో, ఇంకోచోట 40 ఫీట్ల దూరంలోనే జరగడం గమనార్హం. ముడుపుల మహత్యంతోనే డ్రెయినేజీ నిర్మాణం వంకలు తిరుగుతూ నిర్మాణం పూర్తి చేసుకుందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార, కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్ల స్థలాల వద్ద కూడా రోడ్డు వైపు డ్రెయినేజీ నిర్మాణం చొచ్చుకురావడం వెనుక ఆంతర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వ్యాపారుల నుంచి రూ.10లక్షల లంచం..
డ్రెయినేజీ నిర్మాణం ఎస్‌బీహెచ్ బ్యాంకు ఎదురు ప్రాంతానికి వచ్చే సరికి రోడ్డుకు కేవలం 40ఫీట్ల దూరంలోనే డ్రెయినేజీ నిర్మాణం జరగడం గమనార్హం. ఇక్కడి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు 55 ఫీట్ల దూరం నిబంధనకు మునిసిపల్ అధికారులు పాతరవేశారు. వ్యాపారులకు లబ్ధి చేకూర్చినందుకుగాను సదరు వ్యాపారుల్లోనే ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి రూ.10లక్షలు మునిసిపాలిటీ పెద్దలకు, అధికారులకు అందేలా చూసినట్లుగా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఓ వ్యాపారి మధ్యవర్తిత్వం వహించిన మరో వ్యాపారి వద్ద కుదిరిన ఒప్పంద కాగితం కూడా ‘దిశ’కు లభించింది. రూ.2లక్షలు మునిసిపాలిటీ అధికారులకు ముట్టజెప్పినా.. తన షాపు ఎదుట ఉన్న బోరును తొలగించి దానిపై నుంచే డ్రెయినేజీ నిర్మాణం జరిపించారని వాపోయారు. లంచం ఇచ్చారు కదా నా జోలికి రారని అనుకుంటే విశ్వాసం లేకుండా ఇలా చేశారంటూ ఓ వ్యాపారి వాపోతుండటం కొసమెరుపు.