మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు : KTR

by Anukaran |   ( Updated:2020-08-21 10:31:56.0  )
మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు : KTR
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టణాలు వేగంగా అభివృద్ధి సాధించేందుకు ప్రతి మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్లు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. వీరు ప్రజలు-ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తారని మంత్రి చెప్పారు. శుక్రవారం పురపాలక శాఖపై ప్రగతిభవన్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో వార్డు ఆఫీసర్ల నియామకం ప్రక్రియను తెరమీదకు తీసుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నట్లు ప్రకటించారు.

పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని.. ఈ ఖాళీల భర్తీ ద్వారా పట్టణ ప్రగతి మరింత వేగంగా ముందుకెళ్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. పౌరుడే కేంద్రంగా పౌరసేవలను ప్రజలకు త్వరితగతిన అందించేందుకు, పట్టణాల క్రమానుగత అభివృద్ధికి ఖాళీల భర్తీ దోహదపడుతుందన్నారు.దీనిద్వారా నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed