మంత్రి ఎర్రబెల్లికి ఘోర అవమానం.. కౌన్సిలర్లపై ఆగ్రహం (వీడియో)

by Shyam |   ( Updated:2023-06-13 16:29:29.0  )
Minister Errabelli dayakar rao
X

దిశ, తొర్రూరు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఘోర అవమానం జరిగింది. ఆదివారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరు కానీ వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి రాని కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకేనా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది అని అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. మహిళా కౌన్సిలర్ల స్థానంలో భర్తలు హాజరు కావడంపై మంత్రి తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. అనంతరం అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే, మహిళా కౌన్సిలర్ల స్థానంలో భర్తలు హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను శశాంకను సభా వేదికపై నుంచే ఆదేశించారు. బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని, ఈ పండుగకు ఆడుపడుచు కానుకగా సీఎం కేసీఆర్ అందించే చీరల పంపిణీలో మహిళా కౌన్సిలర్స్ రాకుండా వారి భర్తలు హాజరు రావడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

Next Story