‘అజాంజాహి’కి కూరగాయల మార్కెట్

by Shyam |
‘అజాంజాహి’కి కూరగాయల మార్కెట్
X

దిశ, వరంగల్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా వరంగల్ కూరగాయల మార్కెట్‌ను అజాంజాహి మిల్లు గ్రౌండ్‌కు తరలించనున్నారు. ఈ మేరకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేల సత్పతి ఈ గ్రౌండ్‌ను శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతమున్న మార్కెట్ ఇరుకుగా ఉన్నందున ప్రజలు సామాజిక దూరం పాటించడం వీలుకాదనీ, అందుకే 32 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న అజాంజాహి గ్రౌండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మార్కెట్ పరిసరాల్లో ఎమ్మెల్యే నరేందర్.. స్ప్రేను పిచికారీ చేయించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలనీ, అత్యవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags: warangal, vegetable market, azam zahi ground, corona precautions, corona, virus, mla narendhar, collector rajiv gandhi hanumanthu,

Advertisement

Next Story

Most Viewed