- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం వస్తే ఏంటి.. పేషెంట్‌ను తరలిస్తున్న వాహనాలు ఆపేస్తారా?
దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జనంపై కొన్నిచోట్ల పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. సీఎం పర్యటించే రూట్లలో బందోబస్తు పేరుతో కాజీపేట నుంచి వరంగల్ ఎంజీఎం వరకు ప్రధాన రోడ్డును బ్లాక్ చేశారు. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తున్న జనాలను రోడ్డెక్కేందుకు అనుమతివ్వకపోవడం గమనార్హం. వైద్యం కోసం వెళుతున్న వారు కాళ్లా వేళ్ళా పడిన కనికరించకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. గల్లీల్లో నుంచి ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్న పోలీసులను లైఫ్ లైన్ హాస్పిటల్ వద్ద కొంతమంది బాధితులు నిలదీయగా పోలీసులు బెదిరింపులకు దిగారు. ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తున్నామని చెప్పి తప్పిచుకోవడం గమనార్హం. బాధితులను పోలీసులు బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా ‘దిశ’ వరంగల్ ప్రతినిధి దృశ్యాలను కెమెరాలో బంధిచారు.