ఆ విషయంలో మహేశ్, విజయ్‌కు మధ్య యుద్ధం తప్పదా?

by Shyam |
mahesh babu
X

దిశ, సినిమా : సూపర్‌స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’. బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న సినిమాను తొలుత జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ సంక్రాంతి బరిలో సినిమాల సంఖ్య పెరగడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ లేటయ్యే చాన్స్ ఉండటంతో రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 1గా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే, మహేశ్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పోటీ ఎదురుకానుంది. విజయ్- పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ కూడా అదే తేదీన విడుదలయ్యే చాన్స్ ఉంది.

‘లైగర్’ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి కాగా.. పోస్ట్‌ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఏప్రిల్ 1న మూవీ రిలీజ్ చేసేందుకు పూరీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మహేశ్, విజయ్‌ ఫ్యాన్స్ మధ్య యుద్ధం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. విజయ్ బాక్సర్‌గా కనిపించనున్న సినిమాలో మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story