ఎర్రకోట హింసాత్మక ఘటన.. వాంటెడ్ నిందితుడు గుర్జర్ సింగ్ అరెస్ట్

by Shamantha N |   ( Updated:2021-06-28 11:29:47.0  )
ఎర్రకోట హింసాత్మక ఘటన.. వాంటెడ్ నిందితుడు గుర్జర్ సింగ్ అరెస్ట్
X

న్యూఢిల్లీ: ఎర్రకోట హింసాత్మక ఘటనకు సంబంధించి వాంటెడ్ లిస్టులో ఉన్న నిందితుడు గుర్జర్ సింగ్‌ను నార్త్ రీజీయన్ స్పెషల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు. అతన్ని అమృత్‌సర్‌లో నార్త్ రీజియన్ స్పెషల్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారని డీసీపీ సంజీవ్ యాదవ్ తెలిపారు. నిందుతున్ని మూడు రోజుల కస్టడీకి పంపినట్టు తెలిపారు. కాగా సాగుచట్టాల రద్దు కోసం రిపబ్లిక్ డే రోజు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ ఎర్రకోట వద్ద హింసాత్మకంగా మారింది. అయితే ఆ అల్లర్లలో వాంటెడ్ లిస్టులో ఉన్న గుర్జాట్ సింగ్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డుగా ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు పంజాబ్, ఢిల్లీలో తీవ్రంగా గాలించారు.

Advertisement

Next Story