- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటర్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్టోరల్ డేటాను ఆధార్ ఎకో సిస్టమ్‌తో అనుసంధానించే బిల్లు సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021, స్వల్ప చర్చ తర్వాత వాయిస్ ఓటుతో ఆమోదించారు. దీని ద్వారా దేశంలో ఉన్న ఓటర్లు అందరు ఆధార్‌కు అనుసంధానం చేయబడతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది. ఎలాంటి సంక్షేమ పథకాలకు అయినా ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ ద్వారా ఒక్కరికి ఒక్క ఆధార్ మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ ఓటర్ కార్డు విషయంలో అలా కాదు. ఒక్కరి పేరిట రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటర్ కార్డు కలిగి ఉన్న వారు ఉన్నారు. దీని వలన ఎలక్షన్స్‌లో రెండు సార్లు ఓటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి తప్పులు జరగకుండా ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఒక్కరికి ఒక్క ఓటర్ కార్డు మాత్రమే ఉంటుంది. దొంగ ఓట్లు వేయకుండా చూడవచ్చు. మీరు మీ ఓటర్ కార్డును, ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసమే వాటి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
-మెుదటగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in/ కు వెళ్ళాలి.
–మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, ఓటర్ ఐడీ నంబర్‌ను ఉపయోగించి పోర్ట్‌లోకి లాగిన్ అవ్వాలి.
–రాష్ట్రం, జిల్లా, మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలి. తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
–సరిగ్గా నమోదు చేసినట్లయితే, మీ వివరాలు ప్రభుత్వ డేటాబేస్‌తో సరిపోలుతాయి. స్క్రీన్‌పై వివరాలు చూపిస్తుంది.
–స్క్రీన్ ఎడమ వైపున ఉన్న ‘ఫీడ్ ఆధార్ నంబర్’ ఎంపికను క్లిక్ చేయండి.
–తరువాత వచ్చే పేజిలో మీ ఆధార్ నంబర్, ఓటర్ ID నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌పై కనిపించే వివరాలను నింపాలి.
–తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అలాగే, మీరు అందించిన వివరాలను క్రాస్ చెక్ చేయడం మర్చిపోవద్దు.
–ఇప్పుడు, అప్లికేషన్ విజయవంతంగా నమోదు చేయబడిందని స్క్రీన్‌పై కనిపిస్తుంది.