- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పినపాకలో భయం.. భయం.. పులి కోసం అధికారుల జల్లెడ
by Sridhar Babu |
X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పరిధి అటవీప్రాంతంలో పులి భయం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. అమరారం అటవీ ప్రాంతంలోని జూదాల చెరువు వద్ద పులి ఓ ఆవు దూడను చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో ఫారెస్ట్ అధికారులు పులి జాడకోసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో బుధవారం మండలంలోని గోపాలరావుపేట, బాపనకుంట చెరువు వెనుక పులిని చూశామని కొంతమంది వ్యక్తులు తెలిపారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు గోపాలరావు పేట ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో బాపనకుంట చెరువు దగ్గర పులి పాదాలను అధికారులు గుర్తించారు. గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి గోపాలరావుపేట అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
Advertisement
- Tags
- forest
Next Story