జనావాసాల్లో జింక సంచారం

by Anukaran |
deer 1
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం కోమళ్ల బస్ స్టాండ్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఓ జింక ప్రత్యక్షమయ్యింది. జింకను కుక్కలు తరమడంతో బస్టాండ్ ప్రక్కనే ఉన్న తండా వైపు జింక పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు జింకను కాపాడే ప్రయత్నం చేయగా అది తప్పిచుకపోయి చింతలగూడెం వైపు వెళ్లి పోయింది. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తల పించడంతో జంతువులు జనావాసంలో సంచరిస్తున్నాయి అని గ్రామస్తులు చర్చించుకున్నారు.

Advertisement

Next Story