పట్వారీల వ్యవస్థ రద్దు..?

by Shyam |   ( Updated:2020-09-07 06:48:07.0  )
పట్వారీల వ్యవస్థ రద్దు..?
X

దిశ వెబ్ డెస్క్: వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ టీఆర్‌ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల దగ్గరి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకునే పనిని కలెక్టర్లకు అప్పజెప్పింది. సాయంత్రం మూడు గంటలలోగా వీఆర్వోల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలనీ, 5గంటల వరకల్లా దీనిపై తమకు రిపోర్టు పంపించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాలన చేస్తానంటూ గతంలో కేసీఆర్ చాలా సార్లు చెప్నారు. కాగా ఇటీవల పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న నేపథ్యంలోనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా దీనిపై వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ మాట్లాడుతూ..వీఆర్వోల విషయంలో కొన్ని రోజులుగా పలు కథనాలు వస్తున్నాయని అన్నారు. అసెంబ్లీలో కూడా సీఎం మాట్లాడారని తెలిపారు .కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని అయితే అందులో తమ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపాలని కోరారు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నామని, చాలీ చాలని జీతాలతో బతుకుతున్నామని అన్నారు. కానీ ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించకుండా ఇతర శాఖలు బదిలీ చేస్తోందంటూ వాపోయారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అలాగని అందరిపై అవినీతి ఆరోపణలు చేసి వేరే శాఖలకు పంపవద్దని కోరారు.

Advertisement

Next Story