కరోనాతో మరో రెవెన్యూ అధికారి మృతి..

by Sumithra |
కరోనాతో మరో రెవెన్యూ అధికారి మృతి..
X

దిశ, ఖమ్మం రూరల్​ : కరోనా రక్కసి కారణంగా మరో రెవెన్యూ అధికారి ప్రాణాలు కోల్పోయారు. వేంసుర్​మండలం బీరపల్లి గ్రామానికి చెందిన చావా లక్ష్మణ్​రావు(49) రూరల్​మండలం గోళ్లపాడు గ్రామానికి VROగా పనిచేస్తున్నాడు. గత వారం రోజుల కిందట ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లక్ష్మణ్​రావు మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

జిల్లా రెవెన్యూ అసోసియేషన్​ ఆర్థిక సాయం..

వీఆర్వో లక్ష్మణ్​రావు లేనిలోటు తీర్చలేనిదని ఆయన కుటుంబానికి సంఘం తరుపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, రూరల్​ తహసీల్దార్​కారు మంచి శ్రీనివాసరావు తెలిపారు. కుటంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ఆర్ఐ ప్రవీణ్​చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రూరల్​ తహసీల్దార్​కార్యాలయంలో మౌనం పాటించి నివాళ్లు అర్పించారు.

Advertisement

Next Story