- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 23.68 శాతం పోలింగ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఆరంభమైన మహబూబ్ నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి 23.68% ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,19,367 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్న సమయానికి 23.6 8 శాతంతో 28,270 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, మహబూబ్ నగర్ జిల్లాలో 35,510 ఓటర్లకు గాను 26.8 శాతంతో 9,546 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా నాగర్ కర్నూలు జిల్లాలో 33,924 మంది ఓటర్లకు గాను 21.29శాతంతో 7,222 మంది ఓటర్లు, గద్వాల జిల్లాలో 14,876 మంది ఓటర్లకు గాను 26.36 శాతంతో 3,922 మంది, నారాయణపేట జిల్లాలో13,899 మంది ఓటర్లకు గాను 18.26% తో 2,538 మంది ఓటర్లు, వనపర్తి జిల్లాలో 21,158 మందికి గాను 23.83 శాతంతో 5,042 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.