మా ఇంటికి రావద్దు.. నేతలకు షాకిస్తున్న ఓటర్లు

by Shyam |   ( Updated:2021-04-22 23:53:28.0  )
మా ఇంటికి రావద్దు.. నేతలకు షాకిస్తున్న ఓటర్లు
X

దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న నేతలకు ఓటర్లు షాకిస్తున్నారు. ఓట్లు అభ్యర్థించడానికి రావద్దంటూ ఇంటి గేట్లకు ప్లకార్డులను పెడుతున్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో మా ఇంటికి ప్రచారానికి రావద్దంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ‘మీరు వద్దు.. మీ ప్రచారం వద్దు.. మా ప్రాణం మాకు ముద్దు..’ అంటూ ఇంటి గేట్లకు ప్లకార్డులను ఏర్పాటు చేస్తుండటంతో ఓటర్లకు ఎలా దగ్గరయ్యేది అనే భయం నేతలకు పట్టుకుంటోంది.

Advertisement

Next Story