- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటేయండి’
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఈ రోజు పశ్చిమ బెంగాల్ చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ ప్రజలందరూ ఓటేయాలి. ప్రజాస్వామ్య పర్వదిన వేడుకకు మరింత వన్నె తేవాలి’ అని ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు ఎనిమిదో విడత ఎన్నికల్లో భాగంగా 35 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. 283 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కనీసం 84 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. గత విడతల్లో హింస చెలరేగడంతో ఈసారి బందోబస్తును ఈసీ మరింత పెంచింది.
రక్తదాహం.. : మహువా మోయిత్రా
కరోనా మహమ్మారి కబళిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎనిమిది విడతలను వీలైనంతగా కుదించి తొందరగా పోలింగ్‌ను ముగించాలని టీఎంసీ పలుమార్లు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. తాజాగా, మహువా మోయిత్రా ఈసీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 35 అసెంబ్లీ సీట్లు.. అందులోనూ కోల్‌కత్తాలోని ఐదు జనసాంధ్రత అధికంగా ఉండే ఐదు స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం రక్తదాహంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నదని విమర్శించారు.