- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొన్న నర్సులు.. నేడు వాలంటీర్లు.. సచివాలయంలో చిందులు వేస్తూ దారుణంగా(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించే స్థలం.. నిత్యం ఎవరో ఒకరు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుపోతూ ఉంటారు. అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎలా ఉండాలి.. నియమ నిబంధనలతో.. ఎప్పుడు ప్రజలకు సేవచేసే విధంగా ఉండాలి. అన్నింటికి మించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలి. కానీ ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు పనులను మరిచి పార్టీల మీద ఫోకస్ పెడుతున్నారు. ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటుంది అనుకోవడానికి కూడా లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలోనే వేరే కార్యకలాపాలలో మునిగి తేలుతున్నారు. ఇటీవల హాస్పిటల్ లో నర్సులు డాన్స్ వేసిన ఘటన మరువకముందే.. గ్రామ వాలంటీర్లు సచివాలయంలో చిందులు వేసి రచ్చ చేశారు. పని వేళలలో పనులు మరిచి.. డాన్స్ లు వేస్తూ లోకాన్నే మరిచారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాలలో కి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ వార్డు సచివాలయంలో వాలంటీర్లు చేసిన నిర్వాకం విమర్శలకు దారి తీసింది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి వార్డు సచివాలయంలో సోమవారం సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో సచివాలయాన్ని డాన్స్ ఫ్లోర్ గా మార్చేశారు. విధులు నిర్వహించకుండా సినిమా పాటలకు డాన్సులేశారు. మన్మధ రాజా.. మన్మధ రాజా అంటూ లేడీ వాలంటీర్ తో కలిసి చిందులేశాడు మరో వాలంటీర్. అసలు చేసేదే తప్పు.. మళ్లీ దాన్ని ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయ్యి విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే.. వీరేమో ప్రజలను, పథకాలను, మరిచి.. పార్టీలు చేసుకొంటూ ప్రభుత్వాన్ని విమర్శల పలు చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.