కరోనాకు బెస్ట్ మెడిసిన్ వోడ్కా?

by sudharani |
కరోనాకు బెస్ట్ మెడిసిన్ వోడ్కా?
X

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. సాధారణ మానవుడి నుంచి అగ్రదేశాల దేశాల అధిపతులు, ప్రధానులకు సైతం ఈ వైరస్ పేరు చెబితే ముచ్చెమటలు పడుతున్నాయి. కరోనా మహమ్మారికి విరుగుడు కనుగొనేందుకు సైంటిస్ట్‌లు రాత్రిభవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెలారస్ అధ్యక్షుడు లూకాషెంకో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వోడ్కానే కరోనాకు సరైన మందు అని, దాని తాగితే ఈ వైరస్ మన దరిచేరదని పేర్కొన్నాడు. దాంతోపాటే ఆవిరి స్నానం తరచు చేస్తూ ఉంటే వైరస్ చనిపోతుందని వెల్లడించారు. తన మాటలను నిజం చేసేందుకు బెలారస్‌లో క్రీడా పోటీలను నిర్వహిస్తూ, స్వయంగా పాల్గొంటున్నాడు. కరోనాను ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించడాన్ని తప్పు పట్టడమే కాకుండా, పిచ్చితనం అంటూ విమర్శలు చేశారు.

Tags : vodka is best medicine, corona, belarus president lukashenko

Advertisement

Next Story