- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో రెచ్చిపోయిన పోలీసులు.. బలవంతంగా హెల్త్ వర్కర్‌ను ఈడ్చుకెళ్లే ప్రయత్నం..!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో ప్రజలు బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ దేశవ్యాప్తంగా పోలీసులు మంచి గుర్తింపును తెచ్చుకుంటుంటే.. విశాఖ పోలీసులు మాత్రం చెడ్డపేరును మూటగట్టుకున్నారు. కరోనా విధులకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న హెల్త్ వర్కర్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా స్టేషన్ తరలించేందుకు యత్నించారని ఆమె వాపోయింది. తన వద్ద అన్ని ధృవపత్రాలు ఉన్నా కావాలని తన బైక్‌కు ఫైన్ విధించారని.. అది రద్దు చేయాలని కోరినందుకు.. మమ్మల్నే ప్రశ్నిస్తావా..? అంటూ పోలీసులు తనపై సీరియస్ అయ్యారని యువతి వాపోయింది. అంతే కాకుండా తాను తాగివచ్చానని అంటూనే అరెస్టు చేయాలని చూశారని మండి పడింది. ఈ ఘటన విశాఖలోని రామాటాకీస్ జంక్షన్‌లో శనివారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ అపర్ణ విశాఖలోని ఆరిలోవలో ఉంటూ అపోలో ఫార్మసీలో టైపిస్టుగా పనిచేస్తోంది. డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆపితే చూపించడానికి కంపెనీ ద్వారా పర్మిషన్ లెటర్ కూడా తీసుకుంది. ఐడీ కార్డు, లెటర్ కాపీ ఉన్నా మూడో పట్టణ ఎస్‌ఐ ఆమె వాహనానికి రూ.535 ఫైన్ విధించారు. ఈ విషయాన్ని సోదరుడు ఆమెకు వివరించడంతో హెల్త్ వర్కర్ పోలీసులను ప్రశ్నించింది.
ఫైన్ రద్దు చేయాలని కోరడంతో అమ్మాయి ఎక్కువ మాట్లాడుతోంది. మద్యం తాగి ఉంటుందని అనడంతో పాటు పరీక్షల కోసం స్టేషన్‌కు తీసుకువెళ్లాలని ఒక పోలీస్ అధికారి ఆదేశించారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘తనను చంపినా పోలీస్ స్టేషన్‌కు రానంటూ ఆ యువతి ఆమె రోడ్డుపై బైఠాయించింది. ఆ సమయంలో జనం ఎక్కువగా ఉండటంతో ఈ దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో వారిని వదిలేసినట్లు తెలుస్తోంది.