- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పారావు అబద్దం చెప్పాడు..?
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లో మూడు రోజుల క్రితం కలకలం రేపిన ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. అప్పల రాజు చెబుతున్న వివరాలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఉండడంతో పోలీసులు సీసీపుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తనను మంకీ క్యాపులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సాగర్ నగర్ రుషికొండ పరిసరాల్లో కత్తితో దాడి చేసి లక్షా 25 వేల రూపాయలు ఎత్తుకుపోయారని అప్పారావు చెప్పగా.. సీసీ పుటేజీలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అప్పారావు ఒక్కడే ఆటో ఎక్కుతున్నట్టు గుర్తించారు. దీంతో అప్పలరాజు మాటలు అబద్దమని పోలీసులు నిర్ధారించుకున్నారు. కత్తిగాయాలకు గురైన అప్పారావు షర్ట్‌పై ఎటువంటి మరకలు లేకుండానే పొట్టపై రెండు కత్తి గాట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఫైనాన్స్ వ్యాపారంలో ఒత్తిళ్లను పక్కదారి పట్టించేందుకు కిడ్నాప్ డ్రామా ఆడారా అన్నకోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.