బాల్క సుమన్‌కు సవాల్ విసిరిన వివేక్ వెంకటస్వామి

by Anukaran |   ( Updated:2021-08-18 05:58:53.0  )
బాల్క సుమన్‌కు సవాల్ విసిరిన వివేక్ వెంకటస్వామి
X

దిశ, చెన్నూర్ : స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మహా పాదయాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. పాదయాత్ర రెండవ రోజులో భాగంగా స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులను ఆదుకోవాలన్నారు. ఈటల రాజేందర్ పుణ్యమా అని హుజురాబాద్ ఉప ఎన్నికలలో దళిత బంధు పథకం ప్రవేశ ప్రవేశపెట్టినారని, చెన్నూరు కూడా దళితులకు కేటాయించిన నియోజకవర్గమేనని, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేసి దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో అమలు చేసే విధంగా ఆయన కృషి చేయాలని అన్నారు.

ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బీజేపీ పార్టీ నుండి తమ అభ్యర్థిని పోటీ నుండి విరమించుకుని ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని సవాల్ విసిరారు. తనను పార్టీలు మారుస్తున్నాడు అని విమర్శించే స్థానిక ఎమ్మెల్యేకు తమ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుండి వచ్చాడో తెలపాలన్నారు. ఉద్యమ సమయంలో తాను ఒక ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోరు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం కోట్లు దోచుకున్నారని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మందమర్రి బహిరంగసభలో బాల్క సుమన్ తనకు కేటీఆర్ తో సమానం అని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చినప్పటికీ, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జిల్లా మొఖం కూడా చూడలేదని ఆయన ఎద్దేవా చేశారు.

ముంపు గ్రామాలలో రైతుల సమస్యలు, ఆత్మహత్యలు పట్టించుకోకుండా హుజురాబాద్ ఎన్నికల ప్రచార సభలలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటు తిరుగుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగునూరు వెంకటేశ్వర గౌడ్, రాపర్తి వెంకటేశ్వర్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, కొంపల్లి బానేష్ , శ్రీకాంత్, మహేష్, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed