- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్ల్స్ విషయంలో సంజయ్‌దత్ హెల్ప్ చేశాడు : వివేక్ ఒబెరాయ్
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్‌తో కలిసి ‘షూట్‌అవుట్’ మూవీలో నటించిన వివేక్ ఒబెరాయ్.. తన అజ్మీర్‌లోని మయో కాలేజ్‌లో చదువుతున్నప్పడు సంజయ్ చేసిన హెల్ప్ గురించి గుర్తుచేసుకున్నాడు. ఓ సారి ఆయన ఫాదర్, ఫిల్మ్ మేకర్ అయిన సురేశ్ ఒబెరాయ్.. అజ్మీర్‌కు దగ్గరలోని జైపూర్‌లోనే షూటింగ్ చేస్తూ వివేక్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారట. ఈ మేరకు స్కూల్‌కు వెళ్లిన సురేశ్.. తనతో పాటు సంజయ్‌దత్‌ను కూడా వెంట తీసుకెళ్లడంతో తను డబుల్ సర్‌ప్రైజ్‌గా ఫీలైనట్టు తెలిపాడు వివేక్.
లాంగ్ హెయిర్, చార్మింగ్ ఫేస్‌తో కారు నుంచి దిగిన సంజయ్‌ను చూసి ఆశ్చర్యపోయానని.. అదే టైమ్‌లో ఆయన స్టార్‌డమ్‌ను వాడుకోవాలని డిసైడ్ అయిపోయానని అన్నాడు. రోడ్డుకు అవతలి పక్కనున్న గర్ల్స్ స్కూల్‌కు తనతో పాటు ఓ పదినిమిషాలు రావాలని సంజయ్‌ను కోరానని, ఇది తన లైఫ్‌లో ‘మౌకా పే చౌకా మూమెంట్’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజయ్‌తో కలిసి గర్ల్స్ స్కూల్‌కు వెళ్లడంతో వారంతా షాక్ కాగా, తను మాత్రం కింగ్‌లా ఫీలైనట్టు తెలిపాడు. అప్పటి నుంచి వివేక్ కూడా స్కూల్‌లో చిన్నపాటి స్టార్ అయిపోయినట్టుగా పేర్కొన్నాడు.
ఇక ఈ ఇన్సిడెంట్ గురించి ‘షూట్‌అవుట్’ మూవీ సెట్స్‌లో సంజయ్‌కు చెప్తే.. ‘నా వల్ల ఎంతమంది గర్ల్స్‌ను ఇంప్రెస్ చేశావని సరదాగా అడిగాడు’ అని చెప్పుకొచ్చాడు. 2002లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’ వివేక్‌కు మొదటి చిత్రం కాగా, ఆ తర్వాత అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’లోనూ కీ రోల్ ప్లే చేశాడు.