- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నువ్వు దేవుడు సామీ : వివేక్ ఒబెరాయ్
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. నిర్మాత ఆదిత్య చోప్రా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కొవిడ్ -19పై పోరాటానికి మద్దుతుగా తన ప్రొడక్షన్ హౌస్ యశ్‌రాజ్ ఫిల్మ్స్ తరఫున తీసుకున్న డెసిషన్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. అసలు విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇటీవలే 50 సంవత్సరాల మైల్‌స్టోన్‌ను చేరుకుంది. అయితే ఈ సెలబ్రేషన్స్‌కు ఖర్చయ్యే మొత్తాన్ని కొవిడ్-19 సహాయక కార్యక్రమాలకు అందజేసేందుకు ఆదిత్య చోప్రా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా అంధేరిలోని క్వారంటైన్ సెంటర్లలో ఉన్న బాధితులతో పాటు గుర్గావ్‌లోని ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు భోజనం సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సహాయ కార్యక్రమాలపై తాజాగా స్పందించిన వివేక్.. ‘#YRF50 సెలబ్రేషన్స్ బడ్జెట్‌ను ఆపదలో ఉన్నవారికి ఖర్చు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు హ్యాట్సాఫ్ ఆదిత్య చోప్రా. ఫిల్మ్ సర్కిల్‌లోనే కాదు, ఇప్పుడు మానవత్వంలోనూ నువ్వు నిజమైన లీడర్‌వి’ అంటూ ట్వీట్ చేశాడు.
Hats off to #AdityaChopra for turning the budget of the incredible milestone of #YRF50 into a source of helping the people in need.
Truly a leader, not just in the film fraternity but now also in humanity. @yrf #TeamYRF— Vivek Anand Oberoi (@vivekoberoi) May 15, 2021