కామెడీ విందుగా ‘వివాహ భోజనంబు’ టీజర్

by Shyam |
కామెడీ విందుగా ‘వివాహ భోజనంబు’ టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. కమెడియన్ సత్య, అర్జావీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేయగా.. ఫుల్ లెంత్ కామెడీతో ఆకట్టుకుంటోంది. కథ విషయానికొస్తే.. పిసినారి హీరో మహేశ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అదే టైమ్‌లో లాక్‌డౌన్ విధించగా.. వధువు బంధువులందరూ వరుడి ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. తన పిసినారి చేష్టలతో ఎంత ఫన్ క్రియేట్ చేశాడనేది? సినిమాలో చూపించబోతున్నారు. కాగా 2021లో ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు రామ్ అబ్బరాజ్ దర్శకత్వం వహించగా, అనిరుధ్ విజయ్ సంగీతం సమకూర్చారు.

Advertisement

Next Story