- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా విమానాల్లో ప్రభుత్వ డాక్టర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు : విస్తారా ఎయిర్ లైన్
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో తమ వంతు సాయం చేస్తామంటూ విస్తారా ఏయిర్ లైన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు తమ ఏయిర్ లైన్స్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖకు విస్తారా ఏయిర్‌లైన్స్ లేఖ రాసింది. ‘కరోనాపై దేశం జరుపుతున్న పోరులో మేము మా వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా దేశంలోని ప్రభుత్వ డాక్టర్లు, నర్సులను మా ఎయిర్ వేస్‌లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించాలని అనుకుంటున్నాం. వారి పని పూర్తి అయ్యాక మళ్లీ వారిని వారి వారి స్థలాలకు చేర్చే బాధ్యతను కూడా మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. అంతే కాకుండా అత్యవసర ఎయిర్ లాజిస్టిక్ అవసరాల కోసం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఆస్పత్రులు మమ్మల్ని సంప్రదించవచ్చు. వారికి సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. అయితే కార్గోలో ఉన్న స్పేస్‌ను బట్టి వీలైనంత వరకు సహాయం చేస్తాం’ అని లేఖలో పేర్కొంది.