మూడేళ్లు జగన్ సీఎంగా ఉండరు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-04-27 04:40:50.0  )
మూడేళ్లు జగన్ సీఎంగా ఉండరు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా మూడేళ్ల పాటు సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ టీడీపీ, బీజేపీ నేతలు జోస్యం చెబుతున్న నేపథ్యంలో.. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

అటు విశాఖలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగానికి భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదని విమర్శించారు.

Next Story