- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KTR: ఆ ఘనత అన్న నందమూరి తారకరామారావుదే.. టీడీపీపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో : రేవంత్‌రెడ్డి ఓ జాక్‌పాట్ సీఎం అని, ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడమే ఆయన పని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాట్ కామెంట్స్ చేశారు. యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయిన ఆయన అధికారంలోకి వచ్చాక అదే యూట్యూబర్లను బట్టలూడదీసి కొడతాననని అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ (BRS) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లపై ఇవాళ సూర్యాపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో అందరికీ తెలుసని, ఇప్పుడు తనవరకు వచ్చేసరికి యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని మండిపడ్డారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. సొంత పార్టీలో నేతల మధ్య అసూయ, ద్వేషంతోపాటు కాంగ్రెస్ చెప్పిన హామీల ఆశతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు.
ఎన్టీఆర్, టీడీపీపై ప్రశంసలు..
తెలుగు గడ్డపై పుట్టి విజయవంతంగా 25 ఏండ్లకు పైగా ఉన్న పార్టీలు రెండేనని అందులో ఒకటి టీడీపీ (TDP) అయితే రెండవది బీఆర్ఎస్ అని కేటీఆర్ (KCR) అన్నారు. గతంలో తెలుగు వాళ్లను మద్రాసీలు అని పిలిచేవారని, టీడీపీని స్థాపించి తెలుగువాళ్లు కూడా భారతదేశంలో ఉన్నారని అని చాటిచెప్పిన నాయకుడు అన్న నందమూరి తారకరామారావు అని తెలిపారు. తెలుగువాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఎన్టీఆర్ చాటి చెబితే, తెలంగాణకు అస్తిత్వం ఉందని కేసీఆర్ చాటి చెప్పారన్నారు. తెలంగాణ కోసం ధైర్యంగా పార్టీ పెట్టిన నాయకుడు కేసీఆర్ అని, శూన్యం నుంచి సునామీ సృష్టించి, తెలంగాణ సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని చెప్పారు.