- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడ్డ చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి

దిశ, మిరుదొడ్డి: ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడి, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన పుష్పాల శ్రీశైలం, రవళి దంపతుల కూతురు (3) కి గత నెల 23వ తేదీన స్నానం చేయించడానికి వేడి నీరు పెట్టి, రవళి ఇంట్లోకి సబ్బు తీసుకురావడానికి వెళ్లడంతో చిన్నారి వేడి నీటిలో పడగా చర్మం ఉడిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గమనించి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు చిన్నారి పెద్ద నాన్న పుష్పాల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.