CID COURT: పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ.. ఎన్ని రోజులంటే..!

by srinivas |   ( Updated:2025-03-20 11:25:13.0  )
CID COURT: పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ.. ఎన్ని రోజులంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం(Gannavaram) టీడీపీ కార్యాలయం(Tdp Office)పై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరింతగా విచారణ చేపట్టాలని, వల్లభనేని వంశీని ప్రశ్నించేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీఐడీ కోర్టు(CID Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మూడు రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది. ఈ కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే వ్యక్తిని బెదిరించిన కేసులోనూ వల్లభనేని వంశీ జైలులో గడుపుతున్నారు.ఈ కేసులోనూ వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును వంశీ కోరుతున్నారు. ఇదిలా ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని విజయవాడ సీఐడీ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది.

Next Story