- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీసీ రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం

దిశ,భూదాన్ పోచంపల్లి: బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, గత పది ఏళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచడం సాహసోపీత నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, డిసిసి ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, తడక వెంకటేష్, తడక రమేష్, కొట్టం కరుణాకర్ రెడ్డి,గునిగంటి రమేష్ గౌడ్, ఫకీరు నర్సిరెడ్డి, కాసుల అంజయ్య గౌడ్, తోట శ్రీనివాస్, గునీగంటి వెంకటేష్ గౌడ్, ఇట్టమోని మహేష్ యాదవ్, మేకల సంజీవరెడ్డి, రుద్ర చందు, సీత సుధాకర్, బుడ్డ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.