- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏనుకూరు మండలానికి విద్యాశాఖ అధికారి నియామకం ఎప్పుడు?

దిశ, ఏన్కూర్: ఏనుకూరు మండలంలో విద్యాశాఖ అధికారులు లేక మండలం వనరుల కేంద్రంలో విద్యాశాఖ అధికారి కుర్చీ ఖాళీగా కనపడుతుంది. మండలంలో ఎనిమిది హైస్కూలు, 8 పీఎస్ లు 33 ప్రైమరీ పాఠశాల గాను రెండు ప్రైమరీ పాఠశాల మూతపడ్డాయి. గతంలో ఎంఈఓ పనిచేసిన జయరాజు బదిలీపై సింగరేణి మండలానికి వెళ్లడంతో ఇంచార్జ్ ఎంఈఓ గా సింగరేణి ఏనుకూరు మండలాలు విధులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఏనుకూరు మండలం జన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించడంతో ఆయన కొన్ని రోజులు ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీన శ్రీనివాసరావు పదవీ విరమణ చేయడంతో ఆనాటి నుండి ఎంఈఓ ఆఫీస్ లో కుర్చీ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఎంఈఓ ఆఫీస్ కి వివిధ పనులు నిమిత్తం వచ్చేవారు ఖాళీగా వెను తిరిగి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. మండల విద్యాశాఖ అధికారులు లేకుండా పదో తరగతి పరీక్షలు మండలంలో నిర్వహించడం బహుశా ఇదే ప్రథమం అని స్థానిక ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి మండల విద్యాశాఖ అధికారి పోస్టును భర్తీ చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.