- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
విశాఖ రావాలని కేటీఆర్ ను ఆహ్వానించిన ఉక్కు పోరాట కమిటీ
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే ఏపీకి వెళ్లి ఉద్యమం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రకటనపై తెలంగాణలోని కొందరు విమర్శలు చేస్తుండగా ఏపీ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు ప్రకటించినందుకు కేటీఆర్ కు పాలాభిషేకాలు చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో ఐటి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. విశాఖపట్నం సందర్శించి, స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అనుమతితో రిలే నిరాహార దీక్షలో పాల్గొంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.