- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTPCRకు చిక్కని వైరస్.. ఎయిర్‌పోర్టు టెస్టులపై అనుమానాలు
దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు కరోనా నెగటివ్ వచ్చినా సేఫ్కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు ఉన్నా, చాలా మందికి వ్యాధి నిర్ధారణ కావడం లేదు. ఈ కొత్త వేరియంట్ఆర్ టీపీసీఆర్టెస్టు నుంచి తప్పించుకుంటుంది. అయినా క్వారంటైన్‌లో ఉండాలని ఎయిర్పోర్ట్అధికారులు సూచిస్తున్నారు. కానీ, అనేకమంది వైరస్లేదులే అనే భ్రమతో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఇక నాన్ రిస్క్దేశాల నుంచి వచ్చినోళ్లకైతే ఎయిర్‌పోర్టులో శాంపిల్ తీసుకొని పంపించేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ శాంపిల్ నిర్ధారణ తర్వాత సదరు వ్యక్తులకు పాజిటివా? నెగెటివా? అనేది అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వారు బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఆ తర్వాత ర్యాండమ్‌గా చేస్తున్న జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలుతున్న ఒమిక్రాన్‌ని చూసి ఆందోళనకు గురవుతున్నారు.
బుధవారం తేలిన రెండు కేసుల్లోనూ ఇదే జరిగింది. అంతకు ముందు కూడా హైదరాబాద్కుత్భుల్లాపూర్కు చెందిన ఓ మహిళకు ఎయిర్‌పోర్టులో నెగటివ్రిపోర్టు ఇచ్చారు. తర్వాత ఆమె ఇంటికి చేరుకున్నది. ఆ వెంటనే పాజిటివ్ వచ్చిందంటూ అధికారులు హడవుడి చేస్తూ ఆమెను టిమ్స్‌కు తరలించడం గమనార్హం. అయితే ఆమెకు ఒమిక్రాన్ తేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అసలు ఎయిర్‌పోర్టులో చేస్తున్న టెస్టులపై పలువురికి అనుమానాలు నెలకొన్నాయి. టెస్టింగ్ప్రక్రియ సజావుగా జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వ్యాధి వ్యాప్తిని మరింత రెట్టింపు చేస్తాయని వైద్యాధికారులు టెన్షన్‌పడుతున్నారు.
అలెర్ట్..
ఒమిక్రాన్తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నాన్రిస్క్కంట్రీస్నుంచి వచ్చినోళ్లపై కూడా ఇక నుంచి నిఘా పెట్టనుంది. గత 15 రోజుల నుంచి ఎయిర్‌పోర్టులలో పాజిటివ్వచ్చినోళ్లతో పాటు నెగెటివ్వ్యక్తులను ట్రేసింగ్చేయనున్నారు. ఈ మేరకు వైద్యశాఖతో పాటు పోలీస్, రెవెన్యూ శాఖలకు ట్రేసింగ్బాధ్యతలను అప్పగించింది. అనుమానితులు, ప్రైమరీ కాంటాక్ట్‌లకు ఫోకస్పెట్టనున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసి క్వారంటైన్‌కు తరలించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే నాన్రిస్క్దేశాల నుంచి వచ్చిన పాజిటివ్‌లను కూడా మానిటరింగ్చేయనున్నారు. ఒమిక్రాన్అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష కూడా జరగనున్నట్లు సమాచారం.