విరాటపర్వం టీజర్ : చరిత్రలో దాగిన ప్రేమకు తెరలేపిన వెన్నెల!

by Anukaran |   ( Updated:2021-03-18 07:00:05.0  )
విరాటపర్వం టీజర్ : చరిత్రలో దాగిన ప్రేమకు తెరలేపిన వెన్నెల!
X

దిశ, సినిమా : ‘చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ ఆమెది.. ఆమె ప్రేమ అలౌకికం, ఆత్మికం, అపురూపం.. అనల మార్గాన ఉరిమిన రహస్యోద్యమం ఆమె జీవితం..’ ‘విరాటపర్వం’ రూపంలో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అరణ్య(రానా) విప్లవభావాలకు అభిమాని అయిపోయిన వెన్నెల(సాయి పల్లవి).. కన్నవాళ్లను వదిలి అతన్ని వెతుక్కుంటూ అడవులకు వెళ్లింది. మావోయిస్ట్ రూపంలో ఉన్న తన ప్రేమను కలుసుకునేందుకు ఎర్రరంగు పులుముకున్న సీతాకోక చిలుకల్లే పయనించింది. కానీ ఆ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? ఎలాంటి రహస్యోద్యమాన్ని చేసింది? అనేది కథ అని టీజర్ ద్వారా తెలుస్తుండగా… సాయి పల్లవి పాత్రలో ఎంత ఇంటెన్స్ ఉందో అర్థం అవుతుంది.

వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవి, రానా, ప్రియమణి ప్రధానపాత్రల్లో నటిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి టీజర్‌ను రిలీజ్ చేశారు. కాగా టీజర్‌పై సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని.. టీజర్ చూస్తుంటే ఉద్యమం, ప్రేమ రెండూ కలిసిన ఒక గ్రేట్ ఫీలింగ్ లభించిందని చెప్తున్నారు.

Advertisement

Next Story