కొహ్లీని జట్టులోకి తీసుకోవడానికి లంచం అడిగారా..?

by Shyam |
కొహ్లీని జట్టులోకి తీసుకోవడానికి లంచం అడిగారా..?
X

దిశ, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఇతను ఒక గొప్ప క్రీడాకారుడే కాదు. ఒక బ్రాండ్. ఢిల్లీ గల్లీల నుంచి టీంఇండియా కెప్టెన్‌గా ఎదిగిన కోహ్లీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తుది జట్టులో ఎవరు ఆడాలో నిర్ణయిస్తున్న కొహ్లీ.. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎన్నో పరాభవాలు చవిచూశాడు. ఇటీవల ఇండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో కలసి లైవ్ ఛాట్‌లో అనేక విషయాలు పంచుకున్నాడు. రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో తనను ఎంపిక చేయడానికి అప్పట్లో అధికారులు లంచం అడిగారని కోహ్లీ చెప్పాడు. కానీ, లంచం ఇచ్చేందుకు ఒప్పుకోలేదని తన తండ్రి ప్రేమ్ కోహ్లీ అన్నాడు. తన తండ్రి ఎంతో కష్టపడి పైకి వచ్చారని లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించక ముందు మర్చంట్‌గా, నేవిలో పనిచేశారని గుర్తు చేశాడు. ’ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి తన కొడుకు కూడా అలాగే కష్టపడాలని కోరుకుంటాడు. కానీ, లంచాలు ఇచ్చి ఎదగాలని కోరుకోడు కదా. అందుకే ఆ రోజు అలా అధికారుల ఆఫర్‌ను నిరాకరించాడని చెప్పాడు. విరాట్‌లో టాలెంట్ ఉంటే ఆడించండి. లేదంటే వదిలేయండి. అంతేగాని లంచం ఇవ్వను అని మా నాన్న చెప్పాడు ’ అని కొహ్లీ వివరించాడు.

Advertisement

Next Story