- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప గెటప్‌లో విరాట్ కోహ్లీ
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన చివరి బంతికి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు విరాట్ కోహ్లీకి సంబంధించిన పోస్టర్ ఒకటి రూపొందించింది. అల్లు అర్జున్ హీరోగా పుష్ఫ అనే సినిమా రాబోతున్నది. ఇటీవల అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫొటో ఆధారంగా పుష్ఫరాజ్ గెటప్‌లో కోహ్లీని రూపొందించింది. దీనిపై ‘తగ్గేదే లే’ అనే క్యాప్షన్ జోడించి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
‘తగ్గేదే లే.. ఓటమి అంచుల దాకా వెళ్లినా విజృంభించాం. సరిలేరు మాకెవ్వరు అనే మాటకు నిదర్శనంగా నిలిచారు. కోహ్లీ మంత్ర ఫలిచింది.. మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది’ అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు సందేశాన్ని ఉంచింది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు అల్లు అర్జున్ కూడా స్పందించాడు. నవ్వుతున్న ఎమోజీ, థమ్సప్ సింబల్‌ను జోడించి రిప్లై ఇచ్చాడు. ఇక ఐపీఎల్ సీజన్‌లో టాలీవుడ్ హీరోలకు సంబంధించి ఎన్నో మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేస్తుంటారు.
అయితే ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ పద్దతిని మొదలు పెట్టింది. తమ క్రికెటర్లను పలువురు టాలీవుడ్ హీరోలతో పోల్చుతూ పోస్టర్లు విడుదల చేసింది. తాజాగా జాతి రత్నాలు పోస్టర్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్‌సన్, రషీద్ ఖాన్‌లను పెట్టి ‘పెరుగులో వేసుకుంటారు ఉప్పు.. ఎస్ఆర్‌హెచ్ టీమ్ దే ఈ సారి కప్పు’ అనే క్యాప్షన్‌తో స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. ఇది కూడా సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.