నేను ఒంటరివాడినని డిప్రెషన్‌లోకి వెళ్లాను : విరాట్ కోహ్లీ

by Shiva |   ( Updated:2021-02-19 10:55:10.0  )
నేను ఒంటరివాడినని డిప్రెషన్‌లోకి వెళ్లాను : విరాట్ కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలో తానొక్కడినే ఉన్నానని.. తాను చాలా ఒంటరి వాడినని ఒకానొక సమయంలో తాను ఎంతో ఒత్తిడికి గురైనట్లు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన ‘నాట్ జస్ట్ క్రికెటర్’ అనే పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో కోహ్లీ తాను గతంలో ఎదుర్కున్న డిప్రెషన్ గురించి వివరించాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఒత్తిడి కారణంగా సరైన పరుగులు చేయలేకపోయాడు. ఆ పర్యటనలో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడంటా. అసలు ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాలేదంటా. అదే విషయాన్ని పాడ్ కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

‘కెరీర్‌లో విఫలమవుతున్న సమయంలో నాతో పాటు ఎవరైనా వృత్తి నిపుణుడు ఉంటే బాగుంటుందని భావించాను. ఎందుకంటే 2014 ఇంగ్లాండ్ పర్యటనలో నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఆ సమయంలో నా పక్కన ఎవరూ లేరని అనుకున్నాను. ఆ విషయాలు ఎవరితో మాట్లాడాలో కూడా అర్దమయ్యేది కాదు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాను’ అని కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన కోహ్లీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించాడు.

Advertisement

Next Story

Most Viewed