- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరాట్ కోహ్లీ 30 ఏళ్లకే దిగ్గజం అయ్యాడు : యువీ
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతి తక్కువ వయసులోనే కోహ్లీ దిగ్గజాల సరసన చేరాడని.. అతడు కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే చాలా ఎక్కువగా శ్రమించాడని యువీ అన్నాడు. గతంతో పోల్చుకుంటే కెప్టెన్‌గా మారిన తర్వాత కోహ్లీ చాలా నిలకడగా ఆడుతున్నాడని.. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలపై దృష్టిపెట్టాడని యువీ చెప్పాడు. ‘కోహ్లీ ఒక్క రోజులోనే కెప్టెన్‌గా మారలేదు. వేల పరుగులు చేసిన అనంతరమే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఫామ్ కోల్పోతారు. కానీ కోహ్లీ కెప్టెన్ అయ్యాక కూడా నిలకడగా ఆడుతున్నాడు. అతడు 30 ఏళ్లకే ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికే అతడు దిగ్గజ క్రికెటర్‌గా మారిపోయాడు. వీడ్కోలు పలికే సమయానికి ఎవరూ చేరుకోలేని శిఖరాలను కోహ్లీ అధిరోహిస్తాడు. అతడికి ఇంకా చాలా సమయం ఉన్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ అగ్రగణ్యుడు’ అని యువరాజ్ సింగ్ ప్రశంసించాడు.