- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాపారిపై దౌర్జన్యం.. పోలీసుల అదుపులో BJYM నేతలు
దిశ, రాజేంద్రనగర్: వ్యాపారిని బెదిరింపులకు గురిచేసి, దౌర్జన్యంగా డబ్బులు లాక్కున్న కేసులో ముగ్గురు బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఇన్స్‌పెక్టర్ ప్రకాష్ రెడ్డి వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన బీజేవైఎం నేత భాను ప్రసాద్, అతని సోదరుడు శివప్రసాద్, రాజు సహా మరో ఇద్దరితో కలిసి పాలమాకులలోని వెంకటరమణ ట్రేడర్స్ దుకాణంలోకి చొచ్చుకెళ్లి, వ్యాపారితో సహా సిబ్బందిని బెదిరింపులకు గురిచేశారు. అందరినీ బయటకు పంపించి షట్టర్ మూసి వేసి వ్యాపారి నరేందర్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం కౌంటర్‌లోని రూ.50 వేల నగదును బలవంతంగా లాక్కున్నారని బాధితుడు నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని భానుప్రసాద్, శివ ప్రసాద్, రాజు అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శంషాబాద్ ఇన్స్‌పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు.