- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్యాకేజీ 2 ఆచరణ సాధ్యం కాదు
దిశ, న్యూస్‌బ్యూరో: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలు నిరుత్సాహ పరిచాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉందన్నారు. రానున్న 4ఏళ్ల దాకా రెంటల్ అకామడేషన్ సాధ్యమయ్యేపని కాదని విమర్శించారు. నాబార్డు ఫైనాన్స్ స్కీంలు కొత్త సీసాలో పాతసారాగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంపా నిధులు ఏ మేరకు సహాయపడతాయో వేచి చూడాలన్నారు. కేంద్రం వైఖరి చూస్తే ప్లేయింగ్ టు గ్యాలరీలా ఉందని విమర్శించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు హైదరబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో గురువారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గురువారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ 2పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిన్న పరిశ్రమల ప్రతినిధుల వినతులు
ఫిక్స్డ్ విద్యుత్ బిల్లులు మూడు నెలల పాటు మాఫీ చేయాలని, 6 నెలల ఆస్తి పన్నును మాఫీ చేయాలని, కార్మికులకు పారిశ్రామిక వాడల్లోనే వసతి సౌకర్యాలు కల్పించాలని, బ్యాంకులలో పెండింగులో ఉన్న బ్రిడ్జి రుణాలను రిలీజ్ చేయించాలని, ఈఎస్ఐ ద్వారా కార్మికులకు యాభై శాతం నిధులను సమకూర్చాలని చిన్న పరిశ్రమల ప్రతినిధులు వినోద్‌కుమార్‌ను కోరారు. వినోద్‌కుమార్‌ను కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివసాంబిరెడ్డి, జాయింట్ సెక్రటరీ అప్పిరెడ్డి, కోశాధికారి గోకుల్ శ్రీధర్ ఉన్నారు.