సీసీఎంబీ డైరెక్టర్‌గా వినయ్ నందికూరి

by Shyam |
Vinay Nandikuri
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీసీఎంబీ నూతన డైరెక్టర్ గా వినయ్ నందికూరి నియామకమయ్యారు. ఇది వరకు డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రాకేశ్ మిశ్రా పదవి విరమణపొందడంతో సీసీఎంబీ డైరెక్టర్‌గా ఈయన బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ రాకేశ్ మిశ్రా ప్రస్తుతం సీసీఎంబీ సలహాదారునిగా, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జనటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

డాక్టర్ వినయ్ నందికూరి ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో బయోలాజికల్ లో నిపుణులుగా, సైటిస్ట్‌గా ఇది వరకు విధులు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మైకోబాక్టీరియం గురించి, సూక్ష్మ జీవుల కదిలక గురించి అనేక పరిశోధనలు చేపట్టారు. ప్రముఖంగా టిబి, క్షయ వ్యాధులకు కారణమయ్యే మాలిక్యూలర్ సిగ్నలింగ్ సూక్ష్మజీవుల కదలికల గురించి మైక్రో ఆర్గానిజం గురించి విస్తృతంగా అధ్యయనాలు నిర్వహించారు. దేశంలోని పేరుగాంచిన ఇనిస్టిషన్లతో పాటు యూఎస్ లో కూడా విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కళాశాలలో, యూఎస్ టెక్సాస్ లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ఉన్నత విద్యను అభ్యసించారు. అత్యన్నత ప్రతిభను కనబర్చిన వినయ్ నందికూరి ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఎంపిక అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed