- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
UEFA Europa League : యూరోపా లీగ్ విజేత విల్లారియల్స్ ఎఫ్‌సీ
దిశ, స్పోర్ట్స్: యూరోపా లీగ్‌లో విల్లారియల్ ఫుట్‌బాల్ క్లబ్ చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి విల్లారియల్ తొలిసారిగా యూరోపా లీగ్ విజేతగా నిలిచింది. పోలాండ్‌లోని పీజీఈ అరేనాలో బుధవారం రాత్రి మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో విల్లారియల్ ఫుట్‌బాల్ క్లబ్ షూటవుట్‌లో గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయాన్ని జత చేశారు. అయినా ఇరుజట్లు ఒక్కో గోల్ చేసి సమంగా నిలిచాయి. దీంతో షూటవుట్ ద్వారా ఫలితం తేల్చాలని నిర్ణయించారు. షూటవుట్‌లో విల్లారియల్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు కూడా గోల్స్ చేశారు. చివరిగా గోల్‌కీపర్ జెరోనిమో రూలి కూడా గోల్ కొట్టాడు. అయితే మంచెస్టర్ యునైటెడ్ తరపున 11వ గోల్ చేయడానికి వచ్చిన డేవిడ్ డి గియా కొట్టిన బంతినిని గోల్‌కీపర్ జెరోనిమో రూలి ఆపేశాడు. దీంతో విల్లారియల్ 11-10 తేడాతో షూటవుట్‌లో విజయం సాధించింది. యూరోపా లీగ్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన షూటవుట్ ఇదే. ఈ విజయంతో తొలిసారి విల్లారియల్ ఫుట్‌బాల్ క్లబ్ యూరోపా లీగ్ విజేతగా నిలిచింది.