- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్ షాపు ఏర్పాటుకు గ్రామస్తులు అడ్డగింత
దిశ, చిలుకూరు: గ్రామస్థులు ససేమిరా అనడంతో మద్యం దుకాణం ప్రారంభం నిలిచిపోయింది. మండలంలోని బేతవోలులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి రెండు మద్యం దుకాణాలు మంజూరు కాగా.. మండల కేంద్రం చిలుకూరులో దుకాణం గురువారం ప్రారంభించారు. బేతవోలులో మాత్రం గ్రామంలో ఏర్పాటు చేయవద్దని ధర్నా నిర్వహించారు. గతంలో గ్రామం మధ్యలో దుకాణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఒక వృద్ధుడు కూడా మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోదాడ రూరల్ సీఐ శివరాం రెడ్డి, చిలుకూరు ఎస్సై నాగభూషణ్ రావు ఆధ్వర్యంలో ఎక్సైజ్, సివిల్ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కేసులు పెడతామని హెచ్చరించినా మద్యం దుకాణం దూరంగా తరలించేంతవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. చేసేదేమీలేక పోలీసులు వెనుతిరిగారు. గ్రామస్థులు ధర్నా కొనసాగించారు. బేతవోలు సర్పంచ్ ఒట్టి కూటి చంద్రకళ భర్త నాగయ్య కూడా ధర్నాలో పాల్గొనడం గమనార్హం.
- Tags
- case