కరోనాతో చనిపోయిందని తెలియక.. అందరూ కలిసి

by vinod kumar |
Corona virus
X

దిశ, చండూరు: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో కరోనా మహమ్మారి సోకి మృతిచెందిన జంపాల సాలమ్మ(68)కు సాంప్రదాయబద్ధంగా గ్రామస్తులు ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు గాలికొదిలేసి అంత్యక్రియల్లో గుంపులుగుంపులుగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సాలమ్మకు గతవారం రోజులకింద వైరస్ సోకింది. నగరంలోనే ట్రీట్మెంట్ పొందుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని స్వగ్రామమైన ఎస్ లింగోటంకు తీసుకొచ్చారు. గ్రామస్తులు కొంతమంది అడ్డు చెప్పడంతో ఊరుచివరన శవాన్ని ఉంచి దాహన సంస్కారాలు సాంప్రదాయబద్ధంగా చేశారు. అయితే ఈ అంత్యక్రియలు ఎలాంటి కరోనా నిబంధనలు పాటించకండా, నిజానికి ఆమె కరోనాతోనే చనిపోయిందన్న విషయం అంత్యక్రియల్లో పాల్గొన్న చాలా మందికి తెలియదు. దీంతో అందరూ ముందుపడి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో అంత్యక్రియల్లో పాల్గొన్న అందరికీ కరోనా వస్తుందేమో అన్న భయంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

అందరికీ టెస్టులు చేయాలి : ఎంపీపీ శ్వేతా రవీందర్ ‌రెడ్డి

కరోనాతో మృతిచెందిన జంపాల సాలమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరికీ వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించాలని నాంపల్లి ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి వైద్యాధికారులను కోరారు. కరోనాతో చనిపోయందన్న విషయం ఊర్లో ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల భయం పారదోలడానికి అందరికీ కరోనా టెస్టులు చేయాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed