అక్రమంగా ఇసుక రవాణా.. షాక్ ఇచ్చిన గ్రామస్తులు

by Shyam |
sand-Transport
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాలువపల్లి గ్రామ శివారులోని మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించడాన్ని గమనించిన గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దాదాపు ఆరు ట్రాక్టర్ల ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా.. అక్రమంగా తరలిస్తుండటంతో చైన్‌పాక గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన వెళ్లి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చిట్యాల మండలంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Next Story