- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేటీఆర్ ఇలాకాలో తిరగబడ్డ గ్రామస్తులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో గ్రామస్తులు తిరగబడ్డారు. ఉపాధి హామీ పనుల్లో తప్పుడు రికార్డులు సృష్టించి డబ్బులు దండుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు వచ్చిన అధికారుల ముందు అవకతవకల గురించి వివరించారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేటకు గ్రామంలో ఉపాధి కూలీల జాబితాలో పనికి రాకున్న 20 నుండి 30 మంది పేర్లను రాసి డబ్బులు దారి మళ్లీంచారని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం విచారణ కోసం అధికారులు వచ్చారు. గదిలో కూర్చుని విచారణ చేపట్టడం కాదని బహిరంగంగానే ఆరా తీయాలని గ్రామస్తులు కోరారు.
దీంతో అధికారులు ఓపెన్ ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. ఉపాధి కూలీల రిజిస్టర్‌లో 20 నుండి 30 మంది పేర్లను చేర్చి రూ. 5 లక్షలకు పైగానే డబ్బును దండుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో చేపట్టిన పనులతో పాటు ఇంటింటి సర్వే చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బోగస్ ఎన్‌రోల్‌మెంట్ చేసిన వారికి ఇచ్చిన డబ్బులు కూడా రికవరీ చేయాలన్నారు.
- Tags
- authorities