- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ జీతంతో కుటుంబాన్ని పోషించలేను.. కర్నూలు వాలంటీర్ ఆత్మహత్య
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నియమించిన గ్రామ/వార్డు వాలంటీర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంంది. ఇటీవలే అనంతపురంలో ఓ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే కర్నూలు జిల్లాలో మరో వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెదిన వార్డు వాలంటీర్ హబీబ్ బాషా(26) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న అల్లుగుండు అబ్దుల్ ఖాదర్, జైనాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు హబీబ్ బాషా. వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే హబీబ్ బాషాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5వేల వేతనంతో కుటుంబాన్ని పోషించడం కష్టమని హబీబ్ తల్లిదండ్రులకు తెలిపాడు. ఇప్పట్లో పెళ్లి వద్దని..ఈ జీతంతో తాను కుటుంబాన్ని పోషించలేని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించడంతో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హబీబ్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులో బోరున విలపిస్తున్నారు.